Jaya Jaya Subhakara Vinayaka Song Lyrics Devullu Movie S.P.Balasubramanyam - S.P. Balasubramanyam Lyrics

Singer | S.P. Balasubramanyam |
Composer | Vandemataram Srinivas |
Music | Vandemataram Srinivas |
Song Writer | Jonnavitthula Ramalingeswara Rao |
Lyrics
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా....
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
ఆ..ఆ..ఆ..ఆ..
బాహుదా నది తీరములోన
బావిలోన వెలసిన దేవ
మహిలో జనులకు మహిమలు చాటీ
ఇహపరములనీడు మహానుభావా
ఇష్టమైనది వదలీన నీకడ
ఇష్టకామ్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు వరముల నొసగుచూ
నిరతము పెరిగే మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నుతీ చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రామాణము
ధర్మ దేవతకు నిలపును ప్రాణం
విజయ కారణం విఘ్న నాశనము
కాణిపాకమున నీ దర్శనం....
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
పిండి బొమ్మవై ప్రతిభను చూపీ
బ్రహ్మాండ నాయకుడివైనావు
మాతా పితలకు ప్రదక్షిణముతో
మహా గణపతిగా మారావు
భక్తుల మొరలాలించీ బ్రోచుటకు
గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండము నీ బొజ్జలో దాచి
లంబోదరుడవూ అయినావు
లాభము శుభము కీర్తిని కూర్వగ
లక్ష్మీ గణపతివైనావు
వేదపురాణములఖిలశాస్త్రములు
కళలు చాటున నీ వైభవం
వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీకీర్తనం
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
ఆ..ఆ..ఆ..ఆ...
0 Comments